Thursday, January 23, 2025

రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి బుద్ధప్రకాశ్

- Advertisement -
- Advertisement -

Jyoti Buddhaprakash took charge as Commissioner of Transport

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణాశాఖ కమిషనర్‌గా ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కేంద్ర కార్యాల యంలో జ్యోతి బుద్దప్రకాశ్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు, ఉపరవాణా కమిషనర్ డాక్టర్ కె.పాపారావు కమిషనర్ బుద్దప్రకాష్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని కమిషనర్‌తో పాపారావు పేర్కొనడంతో పాటు తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ నుంచి పూర్తి సహకారం అందుతుందని కమిషనర్‌కు పాపారావు హామినిచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతపై అవగాహన, ఇంకా ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చించినట్లుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News