Monday, December 23, 2024

సురేఖ జోడీకి స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Jyoti Surekha and Abhishek Verma from India won gold

 

పారిస్: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్3 టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన జ్యోతి సురేఖ,అభిషేక్ వర్మ జంట మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో సురేఖ జోడీ 152149 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన సోఫిజీన్ ఫిలిప్ జంటను ఓడించింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో సురేఖ జంట అసాధారణ ఆటతో విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ రజతం సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జ్యోతి సురేఖ బ్రిటన్‌కు చెందిన ఎల్లా గిబ్సన్ చేతిలో పరాజయం పాలైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News