Monday, December 23, 2024

మాది విద్వేషవిపణిలో ప్రేమ దుకాణం: సింధియా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బిజెపి ఎంపి జ్యోతిరాధిత్య సింధియా విమర్శలు గుప్పించారు. తమది విద్వేషవిపణిలో ప్రేమ దుకాణమని కొందరు చెబుతుంటారని, కానీ వారి దుకాణంలో అవినీతి, అబద్ధాలు, అహంకారమే అమ్ముతారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కేవలం దుకాణం పేరు మాత్రమే మారస్తుందని, కాంగ్రెస్ దుకాణంలో అమ్మే వస్తువుల మాత్రం మారవన్నారు. ఇండియా కూటమిని కూడా సింధియా విమర్శించారు. 140 కోట్ల భారతీయ హృదయాలలో ఉన్న ప్రధాని మోడీని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు.  మణిపూర్ ఘటనపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, దీన్ని కూడా రాజకీయ సాకుగా ప్రతిపక్షాలు వాడుకున్నాయని మండిపడ్డారు. 1993, 2011లో కూడా మణిపూర్ లో హింస జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని అప్పటి ప్రధానులు ఎందుకు మౌనంగా ఉన్నారని సింధియా ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News