Thursday, January 23, 2025

సుఖేశ్ ఎవరో తెలియదు: కె.కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుఖేశ్ చంద్రశేఖర్ వాట్సాప్ ఛాటింగ్‌పై బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కె.కవిత స్పష్టీకరణ ఇచ్చారు. కెసిఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై దొంగదాడికి దిగుతున్నారని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ కావాలని తనపై తప్పుడు వార్తలు, సమాచారం ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణ వ్యతిరేకులు దినపత్రికలు, టివి ఛానెళ్లు, యూట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకుని దుష్ప్రాచారం చేస్తున్నాయని అన్నారు.

Also Read: ‘దసరా’ సినిమా టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి కితాబు!

ఓ ఆర్థిక నేరగాడు, అనామక లేఖ విడుదలచేస్తే, బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, ఆ వెంటనే బిజెపి ఎంపీ అరవింద్ పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లడం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు.
అసలు సుఖేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయంలేదన్నారు. అతడెవరో, ఎలాంటి వాడో కూడా తనకు తెలియదన్నారు. కానీ ఏమి తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని బురదజల్లుతున్నాయన్నారు. ఇంతకు మునుపు తన మొబైల్ ఫోన్ల గురించి ఎలాపడితే అలా రాయడం, వాగడం చేశారని కూడా పేర్కొన్నారు. మీడియా సంస్థలు, పాత్రికేయులు కనీస విలువలు కూడా పాటించకుండా వ్యవహరించడం భాధాకరమన్నారు.

నిజం, అబద్దం ఏమిటో తెలుసుకునే విజ్ఞులు తెలంగాణ ప్రజలన్నారు. తెలంగాణను దేశంలోనే ప్రగతి పథంలో నిలిపిన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అక్కసుతోనే వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Also Read: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే కాదు: మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే

నా మీద బురద జల్లే వార్తలకు అగ్ర పాధాన్యతనిచ్చే కొన్ని మీడియా సంస్థలు, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ బిడ్డలం తల వంచం… తెగించి కొట్లాడుతాం! జై భారత్…జై తెలంగాణ అంటూ ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News