- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, నిజామాబాద్ సిట్టింగ్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మరోసారి ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో కవిత విజయమార్గం మరింత సుగమం అయ్యింది. ఆమె మంగళవారమే తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఒక్క రోజు అంతరంతోనే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషమైంది. ఆమె గెలిచినట్లు ప్రకటన కూడా వెలువడింది.
- Advertisement -