Monday, December 23, 2024

రాహుల్ వ్యాఖ్యలకు కేకే కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే రాజకీయంగా ఎలాంటి అవగాహన లేదని తేలిందని బిఆర్‌ఎస్ ఎంపీ కే.కేశవరావు విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన గర్జన సభలో బిఆర్‌ఎస్‌పై రాహుల్ గాంధీ చేసిన విమ ర్శలకు బిఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది. సోమవారం బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపి కె. కేశవరావు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ తప్పుడు మాటలు మాట్లాడారన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా బిఆర్‌ఎస్ పోరాటం చేసిం దని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా బిజెపి విధానాలను ఎండగట్టింది తమ పార్టీయేనని ఈ సందర్భంగా ప్రస్తా వించారు. విప క్షాల భేటీకి బిఆర్‌ఎస్ వస్తే తాము రాబోమని రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ వంటి నేత అలా మాట్లాడడం సరైందేనా? అని ఆయన ప్రశ్నించారు. అందరితో కలిసి పోవడం నాయకుడి లక్షణమన్నారు. అందుకు విరుద్దంగా రాహు ల్ గాంధీ వ్యవహరించారని విమర్శించారు. రైతు చట్టాలకు బిఆర్‌ఎస్ సపోర్టు చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం ఆయన అహంకా రానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతు చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడానికి బిఆర్‌ఎస్ కారణమన్నారు. బిజెపిపై పోరాటంలో బిఆర్ ఎస్ వెనుకడుగు వేయదన్నారు. బిజెపితో తమ పార్టీ పోరాడినంతంగా ఏ పార్టీ పోరాటం చేయడం లేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను నిర్వీ ర్యం చేయాలనే వైఖరి సరి కాదన్నారు. దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదేనన్నారు.

భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే
దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని చెప్పారు. జాతీయ పార్టీలు పట్టు కోల్పోయినా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా యని స్పష్టం చేశారు. రాజకీయాల్లో పరిస్థితులు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయన్నారు. రాహుల్ గాంధీ తన స్పీచ్ లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. బిజెపి వ్యతిరేక కూటమికి నాయ కత్వం వహించే లక్షణాలు రాహుల్‌కు లేవన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరిచిన తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News