Wednesday, January 22, 2025

నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఓలి

- Advertisement -
- Advertisement -

నేపాల్ కొత్త ప్రధానిగా సిపిఎన్‌యుఎంఎల్ చైర్మన్, చైనా అనుకూల నేతగా భావిస్తున్న కెపి శర్మ ఓలి ఆదివారం నియుక్తుడయ్యారు. హిమాలయ దేశంలో రాజకీయ సుస్థిరత కల్పన పెను సవాల్‌గా మారిన నేపథ్యంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా ఓలి నాలుగవ విడత పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ఓడిపోయిన పుష్ప కమల్ దహల్ ప్రచండ స్థానంలో 72 ఏళ్ల ఓలి రాజ్యాంగం 76(2) అధికరణం ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ చేపట్టనున్నారు. నేపాల్ రాజ్యాంగం 762 అధికరణం కింద ఓలిని కొత్త ప్రధానిగా అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్

నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం జారీ చేసిన నోటీస్ తెలియజేసింది. పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో ఓలి ప్రధాని అయ్యారు. ఓలి ప్రమాణ స్వీకారం సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రధాన భవనం శీతల్ నివాస్‌లో జరుగుతుంది. ప్రధాని ఓలి సోమవారం చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనతా సమాజ్‌వాది పార్టీ నేపాల్, లోకతాంత్రిక్ సమాజ్‌వాది పార్టీ, జనమత్ పార్టీ, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ వంటి ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంలో చేరవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News