Monday, December 23, 2024

మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి నియామకం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డిని నియమించింది రాష్ట్రం ప్రభుత్వం. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన రెండేళ్లపాటు మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలనలో శ్రీనివాస్ రెడ్డి మీడియాక అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రజాపక్షం ఎడిటర్ గా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ అల్లం నారాయణను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News