Sunday, December 22, 2024

సుశాంత్‌కు రన్నరప్

- Advertisement -
- Advertisement -

K.Sushant runner up in All India Chess Tournament

ఆలిండియా చెస్ టోర్నీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన కె.సుశాంత్ రన్నరప్‌గా నిలిచాడు. అక్షిత్ నేగి (న్యూఢిల్లీ) చాంపియన్‌గా నిలిచాడు. జాతీయ, రాష్ట్ర చెస్ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ పోటీలు నిర్వహించారు. పది లక్షల రూపాయల ప్రైజ్‌మనీ గల టోర్నమెంట్‌లో దేశ వ్యాప్తంగా 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేత నేగికు లక్ష రూపాయల నగదు బహుమతి లభించింది. ఇక రన్నరప్‌గా నిలిచిన సుశాంత్‌కు 70 వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అలెన్ బారీ గ్యాస్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వరుణ్ అగర్వాల్, తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు కెఎస్.ప్రసాద్, ఎకాగ్ర చెస్ అకాడమీ సీఈఓ సందీప్ నాయుడు, సెంట్రో ఎండి శ్రీధర్ తదితరులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News