Wednesday, January 22, 2025

‘కే3 కోటికొక్కడు’ వచ్చేస్తున్నాడు

- Advertisement -
- Advertisement -

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు ఉండటంతో సరైన రిలీజ్ డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News