Wednesday, March 12, 2025

‘క’ అందరికీ నచ్చుతుంది

- Advertisement -
- Advertisement -

‘క’ సినిమా సూపర్ హిట్ తర్వాత సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రూబా చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రము ఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సం యుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరి స్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నా రు. న్యూ ఏజ్ కమర్షియల్ మూవీగా ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ నే పథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమా మహిళలకు నచ్చే లా ఉంటుంది.

మిగతా వారితో పాటు మహిళా ప్రేక్షకులు ‘దిల్ రూబా’ను బాగా ఇష్టపడతారు. 2 గంటల 20 నిమిషాల మూవీలో ఎక్కడా బో ర్ ఫీల్ అవ్వరు. థియేటర్స్ నుంచి బయటకు వ చ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే భావిస్తా రు. ‘క’ కంటే ముందు చేసిన సినిమా కదా ఇందు లో కొత్తగా ఏదీ ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ 10 నుం చి 20 శాతం సీన్స్ ఎక్కడైనా చూ సినట్లు అనిపించినా మిగతా మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుం ది. సినిమాలో లవ్‌లోని మ్యాజిక్ మూవ్‌మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో క్యారెక్టరైజేషన్ బా గుంటుంది. మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అ లా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వర్షన్.

మాజీ లవర్ ప్రస్తుత లవ ర్స్‌ను కలపడం కొత్తగా ఉంటుంది. ఇప్పటిదాకా మన సినిమాల్లో మాజీ లవర్ వల్ల గొడవలు జ రగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ ‘దిల్ రూబా’లో మాజీ లవర్‌తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొ చ్చనే మంచి పాయింట్ ను మా మూవీలో చూస్తా రు. – ‘దిల్ రూబా’లో సిద్ధు క్యారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎమోషనల్ డ్రైవ్‌లో మూవీ సాగుతుంది. పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్స్‌లా ఇందులో హీరో సిద్ధు నమ్మే సిద్ధాంతం, అతను చెప్పే మాటలు ప్రేక్షకుల ను ఆలోచింపజేస్తాయి. ‘దిల్ రూబా’కు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇబ్బంది పెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. -ఇక ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నా. ఈ నాలుగు చిత్రాలు వేటికవి పూర్తిగా భిన్నమైనవి. ఒకటి కల్ట్ లవ్ స్టో రీ, మరొకటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News