Sunday, December 22, 2024

‘క’ సినిమా గ్లింప్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ రోజు కా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తామని సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‘క‘ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News