Wednesday, January 22, 2025

దీపావళికి మంచి మూవీతో వస్తున్నాం.. ‘క’ మూవీ యూనిట్

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో క సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. క సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ‘క’ సినిమా ట్రైలర్‌కు భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ‘క’ సినిమా ట్రైలర్‌ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సందీప్ మాట్లాడుతూ “క సినిమా ట్రైలర్ అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నా. ఈ సినిమా కథను బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కోసం రాసుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా అలాగే చేశాం. కథ చెప్పగానే కిరణ్ వెంటనే ఓకే చేశారు. ‘క‘ సినిమాను స్క్రీన్ మీద కొత్తగా చూపించబోతున్నాము”అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ “మా సినిమాతో దీపావళికి కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నా. దీపావళికి ఒక మంచి మూవీతో వస్తుండటం సంతోషంగా ఉంది”అని తెలిపారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “క సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. మా మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ మొత్తం సర్‌ప్రైజ్ చేస్తాయి. ‘క‘ సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఫైట్స్ కూడా భారీగా కావాలని పెట్టలేదు. ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంటుంది. కథలో కావాల్సివచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ సీన్స్ పెట్టాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నయన్ సారిక, కో ప్రొడ్యూసర్ చింతా వినీషా రెడ్డి, తన్వీ రామ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News