Wednesday, January 22, 2025

కెసిఆర్ ఓటమిపై కే.ఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కే.ఏ పాల్ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. తాను శపించడం వల్లే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కెటిఆర్ ఓడిపోయారని తెలిపారు. తన దీవెనల వల్లే అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సొంత ఛారిటీ కింద ఐదు లక్షల కోట్ల రూపాయలు పంపానన్నారు. ప్రజాశాంతి పార్టీకి 54 శాతం ఓటు బ్యాంకు ఉందని అన్ని ఛానల్స్ సర్వే నివేదికలు చెప్పాయని కే.ఏ పాల్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News