Sunday, January 19, 2025

దేశాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది : కెఏ పాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసిందని ఆపార్టీ పనికిరాని పార్టీగా మారిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఆరోపించారు. సిఎం కెసిఆర్‌కు ఆఖిలేష్ యాదవ్‌ను కలిసేందుకు సమయం ఉంటుందని తనను కలిసేందుకు సమయం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ భేటీ అయిన నేపథ్యంలో కేఏ పాల్ ప్రగతి భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్ గేట్ వద్ద ఆయన కారును సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు.

ముందస్తు అనుమతి లేనిదే లోపలికి పంపడం కుదరదని చెప్పడంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ కంటే నేనే గొప్ప లీడర్‌నని, ఆయన నేను మంచి మిత్రులమని అందుకోసం తనకు లోపలికి అనుమతి ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తాను ప్రగతి భవన్ కు వచ్చానని, అనుమతి ఇస్తే కలిసి ప్రజా సమస్యలను వివరిస్తానని తెలిపారు. రాహుల్ గాంధీ సభలో పార్టీ పుంజుకుంటుందని ఆపార్టీ నాయకులు కలలు కంటున్నారని అది ఎప్పటికి నిజం కావని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News