Sunday, December 22, 2024

తెలంగాణ హైకోర్టులో కెఏ.పాల్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ. పాల్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆయన కోరారు. ఒక పార్టీ నుంచి గెలిచి… అధికారం కోసం మరో పార్టీకి మారడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నుంచి బిఆర్ఎస్ తరపున దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారని… ఆరు నెలలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారని అన్నారు. రాజీనామాలు చేయకుండా పార్టీ మారి అధికారాలు అనుభవిస్తున్నారని ఆక్షేపించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు… అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News