Monday, January 20, 2025

ఈ గుండాయిజం ఏంటి: కెఎ పాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ‘నన్ను హైదరాబాద్, తెలంగాణాలో బ్యాన్ చేయాలి అనుకుంటున్నారా’అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ మండిపడ్డారు. శుక్రవారం అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇటీవల సచివాలయానికి వెళ్తే కూడా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ గుండాయిజం ఏంటని ఆయన ప్రశ్నించారు.

నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై పాల్ స్పందించారు. అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయాన్ని కెసిఆర్ పుట్టినరోజున ప్రారంభించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయిందన్నారు. కెసిఆర్ అవినీతి ఎంతో కాలం చెల్లదని.. అన్నారు. అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ పాల్ గురువారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News