Wednesday, December 25, 2024

రేవంత్ రెడ్డి నన్ను చంపాలని చూశాడు.. కెఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను చంపాలని చూశాడంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నిస్తుంటే 58 సార్లు తన ప్రెస్ మీట్లు ఆపాడని.. నన్ను చంపాలని చూశాడు కానీ చంపగలిగాడా? ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలం పాలనలో ఎప్పుడూ గొడవలేనని విమర్శించారు.

“ఒకరోజు రైతులతో గొడవ.. బేడీలు వేయిస్తాడు.. ఇంకోరోజు సర్పంచులు వస్తే వారిని అరెస్టు చేయిస్తాడు.. నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే.. అరెస్టు చేయిస్తాడు.. నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటే వారి మీద లాఠీ ఛార్జ్ చేయిస్తాడు. ఆర్ఆర్ పేరుతో టాక్స్ వసూలు చేస్తున్నట్లు కంప్లంట్స్ వస్తున్నాయి” అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News