Sunday, December 22, 2024

దానంపై కెఎ పాల్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎమ్మెల్యే దానం నాగేందర్, తాత మధుపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్ కోరారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఎన్నికల సంఘానికే వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. దానం నాగేందర్ గులాబీ జెండా మోసే వాళ్లకు తప్ప వేరే వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వమని బెదిరిస్తున్నారన్నారు.  దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్… బి టీమ్ బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలువవు. పోలీసులకు అండగా ప్రజాశాంతి పార్టీ ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News