- Advertisement -
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘క’ ప్రతిష్టాత్మక 15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ‘క’ సినిమాకు డెబ్యూ డైరెక్టర్స్ సుజీత్, సందీప్ రాసిన బలమైన స్టోరీ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే, సరికొత్త బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకుల్ని మైమరపించింది. గత ఏడాది దీపావళికి రిలీజైన ‘క‘ సినిమా పెద్ద చిత్రాల పోటీని తట్టుకుని బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్‌గా నటించారు. క సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
- Advertisement -