Monday, December 23, 2024

ఆకట్టుకుంటున్న ‘కానున్న కళ్యాణం’…

- Advertisement -
- Advertisement -

Kaanunna Kalyanam lyrical song out from Sita Ramam

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ చిత్రం ఆసక్తికరమైన ప్రొమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ ’కానున్న కళ్యాణం’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సింధూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పది కాలాలు గుర్తుపెట్టుకునేలా ఉంది. స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న ’సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Kaanunna Kalyanam lyrical song out from Sita Ramam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News