Monday, December 23, 2024

‘కావాలయ్యా…’ సాంగ్ తెలుగు వర్షన్ విడుదల..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ’జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జైలర్ మూవీ ఫస్ట్ సింగిల్ ’కావాలయ్యా’పాట తమిళ్ వర్షన్‌లో విడుదలై నేషనల్ వైడ్‌గా వైరల్ అయి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై టాప్ ట్రెండింగ్ లో వుంది.

ఇప్పుడు ఈ సాంగ్ తెలుగు వర్షన్ ని విడుదల చేశారు మేకర్స్. అనిరుధ్ ఈ పాటని క్యాచి బీట్స్‌తో ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ కలసి హైలీ ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్ స్వాగ్ మైమరపించగా తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి. జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News