Friday, November 22, 2024

కబడ్డీ ప్లేయర్లకు అవమానం… (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Kabaddi players served food in toilet in UP

ఉత్తరప్రదేశ్: కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్‌లో భోజనం వడ్డించిన దృశ్యాలు షాకిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్‌లో ఉంచిన పాత్రల నుండి ఆహారం అందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో చోటుచేసుకుంది. యుపిలో జరుగుతున్న యు-17 మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో దాదాపు 300 మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొంటున్నారు. స్థలం కొరత కారణంగా ఇలా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. వీడియోలు వైరల్ కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేసింది. ఈ ఘటపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది పిలుపునిచ్చారు. ఆమె ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ “ఎంత అవమానం!.. క్రీడాకారులకు ప్రాథమిక సౌకర్యాలను అందించలేము, కానీ వారు రాష్ట్రం/దేశం కోసం పతకాలు సాధిస్తారని ఆశిస్తారు.” ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను బర్తరఫ్ చేయాలని శివసేన నేత యూపీ ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News