Wednesday, January 22, 2025

టాయిలెట్‌లో క్రీడాకారిణులకు భోజనాలు

- Advertisement -
- Advertisement -

Kabaddi players served food kept in toilet

యూపీ క్రీడా టోర్నమెంట్ నిర్వాహకుల నిర్వాకం

సహరన్‌పుర్ : ఉత్తరప్రదేశ్ నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా టోర్నమెంట్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలికలకు టాయిలెట్లలో అధికారులు భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో వారు ఇబ్బంది పడుతూనే భోజనం చేశారు. స్థలం లేకపోవడం తోనే ఇలా చేశామని అధికారులు వివరణ ఇవ్వడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది. సహరన్‌పుర్ జిల్లాలో ఈనెల 16న అండర్ 17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీల సమయంలో తమకు స్టేడియం టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్టు కొందరు జూనియర్ ఆటగాళ్లు ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్ గదిలో అన్నం, పప్పు, కూరల పాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్టు వీడియోలో ఉంది. ఒకచోట అయితే పూరీలను నేలపై ఓ పేపర్‌లో వేసి పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సహరన్‌పుర్ క్రీడా అధికారి అనిమేశ్ సక్సేనా స్పందిస్తూ భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను ఛేంజింగ్ రూంలో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. “బాత్‌రూంలో భోజనాలు పెట్టలేదు. ఆరోజు వర్షం కారణంగా స్విమ్మింగ్ పూల్ వద్ద భోజన ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం స్టేడియం నిర్మాణ దశలో ఉంది. వర్షం కారణంగా వంట పాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న చేంజింగ్ రూంలో పెట్టాం” అని సక్సేనా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News