Monday, December 23, 2024

టీవీ సీరియల్ లో నటుడిగా ‘కచ్చా బాదం’ సింగర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమలో దాగి ఉన్న ప్రతిభను చాటిచెప్పేందుకు ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుంది. ఆ కోవకే చెందిన వ్యక్తి కచ్చా బాదం గాయకుడు భూబన్ బద్యాకర్. కచ్చా బాదం పాట ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిన విషయమే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ” కచ్చా బాదం” గాయకుడు భూబన్‌ బద్యాకర్‌ బుల్లి తెరపై అడుగు పెట్టనున్నాడు. ఓ టీవీ సీరియల్ లో నటుడుగా అవకాశం చేజిక్కించుకున్నాడు. బెంగాలీ సీరియల్‌లో తండ్రి పాత్రకు అవకాశం రావడంతో నటించడానికి అంగీకరించాడు.

ఈ సీరియల్ లో తన కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించే అమ్మాయి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తైనట్లు సమాచారం. భూబన్‌ బద్యాకర్‌ ఈ పాత్రలో నటించినందునుకు రూ. 40,000 అందుకున్నాడు. మంచి పాత్రాలు వస్తే.. భవిష్యత్తులో నటిస్తానని చెప్పాడు. గతంలో కూడా పలు రియాల్టీ షోలలో కూడా కనిపించాడు. భూబన్‌ కచ్చా బాదమ్‌ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ పాట సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో హల్ హల్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యాడు. కారు కూడా కొనుక్కున్నాడు. డ్రైవింగ్ నేర్చుకుంటూ యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో చేరాడు. అడిగిన వారికీ లేదంటూ అప్పులు ఇచ్చుకుంటూ వెళ్లి.. ఇప్పుడు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్లి జీవిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News