Sunday, January 19, 2025

కాచిగూడ-బెంగళూరుల మధ్య వందేభారత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్ టు- తిరుపతి టు హైదరాబాద్ టు విశాఖపట్నం -టు హైదరాబాద్ వందే భారత్ రైళ్లు నడుస్తుండగా తాజాగా మరో రైలు ఆగష్టులో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు కాచిగూడ టు -బెంగళూరుల మధ్య రైలు నడిపేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందే భారత్ రైలు అందుబాటులోకి రావడంతో ఏడు గంటల్లోనే బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉండడంతో రెండు నగరాల మధ్య సోమవారం అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు.

రెండు నగరాల మధ్య కొత్తగా పట్టాలెక్కనున్న రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం సైతం ఖరారైంది. ఈనెల 06వ తేదీన రైలును ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న రైళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో కాచిగూడ టు- బెంగళూరు మధ్య రైలు నడిపేందుకు రైల్వేబోర్డు అంగీకారం తెలిపింది. నిత్యం రైలు కాచిగూడ – యశ్వంత్‌పూర్ పరుగులు తీయనుంది. త్వరలోనే అధికారికంగా రూట్, రైలు నడిచే సమయం, టికెట్ల ధరలను సైతం దక్షిణమధ్య రైల్వే ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా….
కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ వందే భారత్ రైలు నంద్యాల జిల్లా డోన్ మీదుగా రాకపోకలు సాగించనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 11 గంటల వరకు పడుతుండగా ఈ రైలు అందుబాటులోకి వస్తే దాదాపు 7 గంటల్లోనే బెంగళూరుకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బెంగళూరుకు ఈ రైలు చేరుకొనేలా రూట్‌మ్యాప్‌ను అధికారులు ఖరారు చేసినట్టుగా తెలిసింది. ట్రాక్ సామర్థ్యం, రైలు వేగంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే సికింద్రాబాద్ టు -బెంగళూరుల మధ్య సుమారు ఏడు రైళ్లు నడుస్తుండగా వీటికి ఫుల్ డిమాండ్ ఉంది.

సికింద్రాబాద్ టు ఫుణే, నాగ్‌పూర్ టు సికింద్రాబాద్ మార్గంలో కొత్తగా
దేశవ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రం భావిస్తుండగా హైదరాబాద్ మార్గంలో మరో రైలును కొత్తగా నడిపించేందుకు కసరత్తు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ – పుణేతో పాటు, నాగ్‌పూర్, సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్, పుణే మార్గంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తుండగా దాని స్థానంలో వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ యోచిస్తోంది. అలాగే నాగ్‌పూర్ టు సికింద్రాబాద్ టు నాగ్‌పూర్ మార్గంలోనూ కొత్తగా రైలు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News