Monday, December 23, 2024

కచిడి చేప@రూ.3.3లక్షలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో మత్స్యకారుల వలకి కచిడి చేప చిక్కింది.  వేలంలో 25 కేజీల చేప రూ.3.30 లక్షల ధర పలకడంతో లక్షాధికారిగా మారాడు. ఈ చేప పొట్టలోని తిత్తులతో ఔషధాల తయారీ చేస్తున్నారు. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గ్లార్ బ్లాడర్ తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కచిడి చేపలు తింటే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. మానసిక సమస్యలు ఉన్నవారు ఈ కాలం చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేదిక్ వైద్యులు సలహా ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News