Thursday, March 6, 2025

కాబోయే భార్యను ఆటపట్టించాలని ఉరేసుకొని ఫొటో పంపించాడు… కానీ పాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐరన్ బాక్స్ వైర్‌ను సరదాగా గొంతుకు చుట్టుకొని కాబోయే భార్యకు భర్త ఫొటో పంపించిన సంఘటన హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తిలక్‌నగర్‌లో ఆదర్శ్ (25) అనే యువకుడు క్యాబ్ డ్రైవర్ పని చేసతున్నాడు. ఈ మధ్యనే అతడికి పెళ్లి సంబంధం కుదరడంతో కాబోయే భార్యతో ఫోన్‌లో మాట్లాడేవాడు. భార్యను ఆటపట్టించడానికి సోమవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైర్‌తో ఉరి వేసుకొని ఫొటో పంపించాడు. కిందికి దిగే సమయంలో ఉరి బిగుసుకుపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతడు మృతి చెందాడు. వచ్చే నెల వివాహం ఉండగా ఆదర్శ్ మృతి చెందడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

దీనికి సంబంధించిన పోస్టు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు ఆ యువకుడిపై కామెంట్లు చేస్తున్నారు. ‘బాగా ఆడాడు కదా, ఆహా వీడితో విధి ఆడింది వింత నాటకం, చావుతో చలగాటం వద్దు అనేది ఇందుకే, అమ్మాయి చాలా లక్కీ అని, మృత్యువు ఎప్పుడు ఆకలితో ఉంటుంది అందుకే ఎప్పుడు దాని దరిదాపులకు కూడా పోవద్దు, ఇలాంటి తీట గాళ్లను పెళ్లి అయ్యాక సైకో లాలా ప్రవర్తించేవాడు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News