Monday, December 23, 2024

నేటి నుంచి ప్రయాణికులకు కాచిగూడ – రాయచూర్ డెము రైలు అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  నేటి నుంచి కాచిగూడ- రాయచూర్ డెము రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు 29 స్టేషన్‌లలో ఆగుతుందని వారు తెలిపారు. ఈ డెము రైలు తెలంగాణ, కర్ణాటక మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుండగా, కాచిగూడ- యశ్వంతపుర మధ్య వందే భారత్ రైలు కూడా ఇటీవలే ప్రారంభమైంది.

ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించగా, ఈ రైలు ప్రతి గురువారం మినహా మిగిలిన రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే రెండు నగరాల మధ్య ఈ రైలు నడుస్తుండగా, ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త అందించింది. కాచిగూడ టు రాయచూర్ డెము రైలు నేటి (అక్టోబర్ 2) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది.

ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 9.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు రాయచూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణానికి దాదాపు 5.40 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయచూర్‌లో బయలుదేరి రాత్రి 9.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. డెము రైలు వాజానగర్, షాద్ నగర్, మహబూబ్ నగర్, దేవరకద్ర, జక్లేరే, మక్తల్, కృష్ణా స్టేషన్‌ల మీదుగా రాయచూర్ చేరుకుంటుంది. రైల్వే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News