Thursday, January 23, 2025

కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

తప్పిన ముప్పు

కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి

ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు

డ్యాంను కాపాడేందుకు మానవ ప్రయత్నాలన్నీ చేసాం

ప్రస్తుతానికి డ్యామ్ సేఫ్ జోన్ లో

సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Kadam project escaped dangerous position

హైదరాబాద్: కడెం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు వాటర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన పడ్డారు.
ప్రస్తుతానికి వరద తగ్గడంతో ప్రాజెక్టుకు పెను ప్రమాదం తప్పింది.

 ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటీ ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని, ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.

ప్రజలు ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లో ఉందని తెలిపారు. వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు. మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వరద ఉద్దృతిని బట్టి క్రమంగా గేట్లను దించేస్తామని పేర్కొన్నారు.

భయానక పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన నీటిపారుదల అధికారులు, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో నిమగ్నమైన కలెక్టర్ ముష్రఫ్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News