- Advertisement -
అమరావతి: కడప వైఎస్‌ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి శివారులో ఆర్‌టిసి బస్సు -ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు మహమ్మద్(25), హసీనా(25), అమీనా(20), షాకీర్(10)గా గుర్తించారు. మృతులు కడప జిల్లాలో ఆజాద్‌నగర్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పులివెందుల డీపోకు చెందిన బస్సు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -