Friday, December 20, 2024

భూవివాదంతోనే శ్రీనివాసుల రెడ్డి హత్య… ఆరుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: భూవివాదాలతోనే శ్రీనివాసుల రెడ్డిని హత్య చేశారని ఎస్‌పి అన్బురాజన్ తెలిపారు. శ్రీనివాసులరెడ్డి, ప్రతాప్ రెడ్డికి మధ్య ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో విభేదాలు ఉన్నాయన్నారు. కడపలో వైసిపి నాయకుడు శ్రీనివాస్ రెడ్డి హత్య కేసులో నిందితులను ఎస్‌పి అన్బురాజన్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. శ్రీనివాస్ రెడ్డి హత్యకేసులో ఆరుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుల్లో మహిళ కూడా ఉందని ఎస్‌పి తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రతాప్ రెడ్డి సహా ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.

Also Read: ఢిల్లీకి బండి సంజయ్‌.. పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ

ఈ హత్యకేసులో ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు, సురేష్ కుమార్, హరిబాబు, సుబ్బయ్య, రాణిలను అరెస్టు చేశామన్నారు. శ్రీనివాసులు రెడ్డి ప్రతాప్‌కు రూ.80 లక్షలు, శ్రీనివాసులకు రూ.60లక్షలు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే నిందితులు కక్ష పెంచుకొని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. నిందితులకు సహకరించిన రాణి అనే మహిళను కూడా అరెస్టు చేశామన్నారు. మరికొందరు అనుమానితులకు నోటీసులు అందజేశామన్నారు. కేసులో ఎంతటివారున్న వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News