Monday, January 20, 2025

ఆ విషయంలో జగన్ కు సిగ్గుచేటు: కడప ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్‌కు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడం సిగ్గుచేటు అని కడప ఎంఎల్‌ఎ మాధవీరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ కోరడం హేయమైన చర్య అని, ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన జగన్‌కు లేదని చురకలంటించారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని, ప్రజలకు ముఖం చూపించుకోలేక జగన్ కుయుక్తులకు తెరలేపారని, స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసిపి ఎంఎల్‌ఎలు అసెంబ్లీలోకి రాలేదని ధ్వజమెత్తారు. జగన్‌కు 11 సీట్లు ఇచ్చి ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారని, వైసిపి పాలనలో ప్రతి ఒక్కరూ నష్టపోయారని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News