Monday, January 20, 2025

కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వరంగల్లు లోక్‌సభ నియోజకవ ర్గం అభ్యర్ధి అయిన డాక్టర్ కడియం కావ్య కారు పార్టీకి భారీ షాక్ ఇచ్చి కాంగ్రెస్ పా ర్టీ అభ్యర్ధిగా బరిలో దిగబోతున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్‌లో ఉ న్న డాక్టర్ కావ్య ఎట్టకేలకు విజయం సా ధించారని, కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి హా మీ రావడంతోనే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా గురువారం రాత్రి నిర్ణయం తీసుకోవడం, పోటీ లో నుంచి తప్పుకోవడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలను కూలంకషంగా వివరిస్తూ కారు పార్టీ అధినేత, మాజీ సి ఎం కెసిఆర్‌కు రాసిన లేఖను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఈ వార్త దావానలంలా వ్యాపించడం, మరికొద్ది సేపటికే కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ ఆఫ ర్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంద రు సీనియర్ నాయకులు వివరించారు. అంతేగాక మాజీ మంత్రి కడియం శ్రీహరి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా పరిశీలిస్తోందని కొందరు నాయకులు వివరించారు. ఎందుకంటే కడియం శ్రీహరి అపారమై న రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావడమే కాకుండా,

ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేకపోవడం, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూ డా సుపరిచితుడు కావడం వంటి సానుకూలమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చా లా సీరియస్‌గా పరిశీలిస్తోందని వివరించారు. ప్రస్తుతం కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఒకవేళ వరంగల్లుగా ఎంపీ గా పోటీలో నిలిపి లోక్‌సభకు పంపిస్తే ఆయన కుమార్తె అయిన డాక్టర్ కడియం కావ్యను స్టేష న్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిం పేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమి టీ సీరియస్‌గా అధ్యయనం చేస్తోందని ఆ నా యకులు వివరించారు. ఏదిఏమైన వరంగల్లు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రంలోనే పెను సంచలనం సృష్టించిన డాక్టర్ కడియం కావ్య బిఆర్‌ఎస్‌కి రాజీనామా చేయడంతో చాలా వేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయని వివరించారు. షెడ్యూల్డు కులాని కి చెందిన డాక్టర్ కడియం కావ్య విద్యాధికురా లు కావడం,

మాజీ మంత్రి, ఆపార రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి కుమార్తె కా వడం మరోక ముఖ్యకారణం కావడం, ఎలాం టి అవినీతి ఆరోపణలు లేకపోవడమే కాకుం డా కడియం కుటుంబసభ్యులు ఎల్లప్పుడూ ప్రజలతోనే మమేకమైన ఉండటం వంటి అనేక సానుకూలాంశాలు ఉండటంతోనే కాంగ్రెస్ పెద్దలు కూడా డాక్టర్ కడియం కావ్య అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారని ఆ నాయకులు వివరించారు. అందుకే బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సిఈసి సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందని, అందుకే వరంగల్లు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్ధిని ఖరారు చేయకుండా చివరి నిమిషంలో వాయిదా వేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి వరంగల్లు లోక్‌సభ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా దొమ్మాట సాంబయ్యను ఖరా రు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానంలో చర్చ లు జరిగాయని, అయితే ఢిల్లీలో సిఈసి సమావేశం జరుగుతు న్న సమయంలోనే డాక్టర్ కడి యం కావ్య కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖం గా ఉన్నట్లుగా హైదరాబాద్ నుంచి ఫోన్‌లో సిఎం రేవంత్ సమాచారం అందిందని, అందు కే వరంగల్లు అభ్యర్ధి పేరును ఖరారు చేయకుండా నిలిపివేశారని ఆ వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News