Monday, December 23, 2024

కడియం ఇంటికి కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఉన్న మంత్రుల నివాసంలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యహరాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యలను కలిశారు. అనంతరం వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆమె ఆహ్వానించారు. అందుకు కడియం కూడా సూచనాప్రాయంగా ఓకే చెప్పారు. అయితే, కాంగ్రెస్‌లో చేరాలంటే ఆయన రెండు షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది. వరంగల్ ఎంపి టికెట్ తనకు ఇవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని కోరినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఆ స్థానంలో తన కూతురుకి అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, ఏఐసిసి కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే నేడు కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు పార్టీలో చేరే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అయితే వరంగల్ ఎంపి సీటును కడియం కూతురు ఇస్తారా లేక కడియం శ్రీహరికి ఇస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.

పార్టీలో ఇంకా చేరలేదు
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తాను ఇంకా చేరలేదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తనను కాంగ్రెస్‌లోకి రావాలని తనను ఆహ్వానించారని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని వారు కోరారన్నారు. శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారు. కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని ఆయన స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ అనేక కారణాల వల్ల బలహీనపడిందని కడియం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News