- Advertisement -
హైదరాబాద్: మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి, కావ్య తీరు బాధ కలిగించిందని బిఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ భవన్ నుంచి వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి నమ్మక ద్రోహి అని, ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కడియం ఎంతో మందిని బలి పశువులను చేశారని, రాజయ్యను కాదని కడియంకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ టికెచ్ ఇచ్చారని పేర్కొన్నారు. కడియం శ్రీహరి వెంటనే తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయాలని ధాస్యం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కడియం కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కావ్య అభ్యర్థిత్వాన్ని అనేక వర్గాలు, దళిత సంఘాలు వ్యతిరేకించాయని, శ్రీహరి అహంకారాన్ని మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.
- Advertisement -