Monday, December 23, 2024

బండిది సంగ్రామ యాత్ర కాదు…. విద్రోహ యాత్ర: కడియం

- Advertisement -
- Advertisement -

Kadiyam srihari comments on Bandi sanjay

హన్మకొండ: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, విద్రోహ యాత్ర అని ఎంఎల్‌సి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ సందర్భంగా కడియం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి బిజెపి ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. బిజెపి ఎంపిలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మా వల్లనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని బిజెపి, కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. నూకలు తినాలన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిలదీశారు. బిజెపి పాలన దేశ ప్రజలకు నచ్చకపోవడంతోనే సిఎం కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News