Wednesday, January 22, 2025

ఎంఎల్ఎ రాజయ్య ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి: కడియం

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: ఎమ్మెల్యే రాజయ్య తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం స్టేషన్ ఘన్‌పూర్‌లోని కెఆర్ గార్డెన్‌లో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం తొందరపడవద్దని సూచించిందని అందుకే కొన్ని రోజులుగా రాజయ్యపై ఎలాంటి విమర్శలు చేయటం లేదని కడియం శ్రీహరి తెలిపారు. జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లో జరిగిన ఓ సమావేశంలో రాజయ్య నాపై తీవ్ర విమర్శలు చేశారని వాటికి నేను వివరణ ఇవ్వకుంటే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉందని ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని కడియం పేర్కొన్నారు. రాజయ్య వైద్యుడిగా ఉండి సభ్యత లేకుండా మాట్లాడటం సిగ్గుగా ఉందన్నారు. నా తల్లి కులం, నా కులం గురించి కూడా మాట్లాడటం దారుణమన్నారు. పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

పిల్లలకు తల్లి సత్యం, తండ్రి అపోహ మాత్రమే అని రాజయ్య మాట్లాడటం అత్యంత దురుదుష్టకరమని సమాజంలోని ప్రతి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడటం బాధాకరమని కడియం అన్నారు. ఆయన మాట్లాడినట్లే నేను నోరువిప్పితే రాజయ్య కుటుంబం ఆత్మహత్య చేసుకుంటారన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగటం అవివేకమన్నారు. నిజంగా రాజయ్య అభివృద్ధి చేసి ఉంటే పల్లె నిద్రలో ప్రజలు ఎందుకు నిలదీస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. నేను ఎప్పుడు పార్టీకి కట్టుబడి ఉంటానని ఎవరికి టికెట్లు ఇచ్చిన గెలిపించి తీరుతామన్నారు. నా బిడ్డను చూసి రాజయ్య భయపడుతున్నాడని ఎవరికి గెలిచే అవకాశం ఉంటే పార్టీ వారికికే టికెట్ ఇస్తుందని కడియం పేర్కొన్నారు. నీ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని ప్రజలకు వివరణ ఇవ్వాలని మాత్రమే స్పందించాల్సి వచ్చిందని కడియం తెలిపారు. ఇప్పటికైనా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కడియం సూచించారు. అదే విధంగా నాపై చేసిన విమర్శలకు బేషరతుగా ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కడియం డిమాండ్ చేశారు.

నేను నికన్నా పెద్ద వాడిని నా తల్లి వయసు 93 సంవత్సరాలు ఆమె ప్రస్తావన ఎందకు తీసుకొస్తున్నావని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధి అంటే మోడల్‌గా ఉండాలని కాని దిగజారుడు రాజకీయాలు చేస్తే ప్రజల్లో విలువ ఉండదన్నారు. ఒకవేళ నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పోటీ నుంచి వైదొలుగుతా అని కడియం శ్రీహరి రాజయ్యకు సవాల్ విసిరారు. ఈ సమావేంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎడవెల్లి కృష్ణారెడ్డి, చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, బూర్ల లతా శంకర్, బెలిదె వెంకన్న, రాపోలు మధుసూదన్‌రెడ్డి, మామిడాల లింగారెడ్డి, తాళ్లపల్లి సమ్మయ్యగౌడ్, మారెపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, గండి రమేశ్‌గౌడ్, భూక్య స్వామినాయక్, పురమాని రజాక్‌యాదవ్, బానోతు రాజేష్‌నాయక్, ఎల్మకంటి నాగరాజు, పులి యాకయ్యగౌడ్, పల్లె రవీందర్, బూర్ల రాజు, ఒగ్గు రాజు, నీరటి ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News