Thursday, December 26, 2024

అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌ను కలిసిన కడియం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల మంజూరు నిమిత్తం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం రైతు ధన్యవాద సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను కలిసి పనుల మంజూరు గురించి వివరించారు. కాగా ధర్మసాగర్ నుంచి తరిగొప్పుల వరకు వయా ముప్పారం, నారాయణగిరి, పీచర, మద్దెలగూడెం, కొమ్ముగుట్ట, లింగంపల్లి, శ్రీపతి పల్లి మీదుగా సుమారు 35 కి.మీ బీటీ రోడ్డు డబుల్ చేయడం, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన రెండు మండలాలైన వేలేరు, చిల్పూర్ మండల కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు, తహసీల్దారు కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, ఇతర కార్యాలయాల నిర్వహణ నిమిత్తం మండల కాంప్లెక్స్ మంజూరు చేయడం, మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి స్థలంలో నూతన దవాఖాన నిర్మించి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్‌పూర్, చాగల్, శివునిపల్లి గ్రామాలను కలుపుకొని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ మంజూరు చేయడం నిమిత్తం కడియం శ్రీహరిని బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News