Monday, November 4, 2024

పల్లా రాజేశ్వర్‌రెడ్డిదే విజయం: కడియం శ్రీహరి

- Advertisement -
- Advertisement -

Kadiyam Srihari MLC Election Campaign in Dharmasagar

ధర్మసాగర్: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిఘన విజయం సాధిస్తారని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎంఎల్‌సి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలోని రెడ్డి కమ్యూనిటీ హాల్లో గ్రామంలోని పట్టభద్రుల ఓటర్లతో సమావేశమై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో మన ప్రాంత వాసి ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రపాలనలో వేలేరు మండలం చాలా వెనుకబడిన ప్రాంతమని, అప్పట్లో ఎండాకాలం వచ్చిందంటే ప్రజలకు తాగడానికి మంచినీరు కూడా దొరికేవి కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ పథకంతో మంచినీటిని అందిస్తున్నామన్నారు. వేలేరు మండలానికి సాగునీరు అందించే బాధ్యత తనపై ఉందని హామీ ఇచ్చారు.

బిజెపి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులకు ఒక్కపైసా ఆర్థిక సాయం కూడా చేయని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతుందని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, ప్రభుత్వరంగ సంస్థలు లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత లక్ష 32 వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. పట్టభద్రులు, మేధావులు ఒక్కసారి ఆలోచన చేసి ఎంఎల్‌సి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రంలో జడ్పిటిసి చాడ సరిత, మాజీ ఎంపిపి బొజ్జ రవీందర్‌యాదవ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కాయిత మాధవరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News