Thursday, December 26, 2024

కాళేశ్వరంపై తప్పుదోవ పట్టించొద్దు: కడియం శ్రీహరి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై గోరంతలు కొండతలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటే అనేక రిజర్వాయర్లు వచ్చాయనీ, నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందనీ చెబుతూ ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్న సంగతి గుర్తించాలని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవని శ్రీహరి అన్నారు. ఈ హామీల అమలుకు ఏడాదికి 1.36 లక్షల కోట్లు అవసరమన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్లో ఏడువేల కోట్లే కేటాయించారని శ్రీహరి చెప్పారు. డిసెంబర్ 9న రైతుల రుణాలను మాఫీ చేస్తారని చెప్పారనీ, రుణమాఫీని ఏ విధంగా, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News