Thursday, January 23, 2025

స్వచ్ఛ సర్వేక్షణ్‌కు ఎంపికైన కడ్తాల్ గ్రామ పంచాయతీ

- Advertisement -
- Advertisement -

కడ్తాల్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో భాగంగా ఎంపికైన కడ్తాల గ్రామపంచాయతీని మంగళవారం స్వచ్ఛ భారత్ మిషన్ డిప్యూటీ సిఇఒ మారం నాగేశ్వర్‌రావు సందర్శించారు. కడ్తాల గ్రామపంచాయతీలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు.

స్థానిక ఎంపిడిఒ కె.రామకృష్ణ, ఎంపిఒ మధుసూధనాచారి, సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ నెల 15 నుండి జిల్లాలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన 14 గ్రామ పంచాయతీలలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, స్థానిక అధికారులు తదితరులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News