Thursday, January 23, 2025

రబాడకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రబాడ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు. రబాడ 860 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో రబాడకు అగ్రస్థానం వరించింది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ 847 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక బుమ్రా 846 పాయింట్లతో మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకోక తప్పలేదు.

భారత్‌కే చెందిన రవిచంద్రన్ అశ్విన్ కూడా రెండు ర్యాంక్‌లను చేజార్చుకున్నాడు. కాగా, ఇంగ్లండ్‌పై సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్ స్పిన్నర్ నొమన్ అలీ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలను మెరుగు పరుచుకుని తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇదిలావుంటే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జో రూట్ (ఇంగ్లండ్) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. రూట్ 903 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News