Monday, December 23, 2024

కైకాల సత్యనారాయణ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇవాళ తుది శ్వాస విడిచారు. కైకాల మృతి చెందడంతో సిని పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు, 60 సంవత్సరాల సినీ జీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో కైకాల లక్ష్మీ నారాయణకు 1935 జూలై 25న సత్యనారాయణ జన్మించారు.

హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. 1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా)
లవకుశ (1963)
పాండవ వనవాసం (1965)
పరమానందయ్య శిష్యుల కథ (1966)
ప్రేమనగర్ (1971)
తాతా మనవడు (1973)
నిప్పులాంటి మనిషి (1974) – షేర్ ఖాన్
జీవన జ్యోతి (1975)
సిరిసిరిమువ్వ (1976)
సెక్రటరీ (1976)
చక్రధారి (1977)
దాన వీర శూర కర్ణ (1977) – భీముడు
యమగోల (1977) -యముడు
శుభలేఖ (1982) – అంకెల ఆదిశేషయ్య
శ్రుతిలయలు (1987) – వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
రుద్రవీణ (1988)
నారీ నారీ నడుమ మురారి (1990) – జానకిరామయ్య
సూత్రధారులు (1990) – నీలకంఠయ్య
గ్యాంగ్ లీడర్ (1991) – జైలర్
భైరవ ద్వీపం (1994)
ముద్దుల ప్రియుడు (1994)
యమలీల (1994) – యముడు
ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు
సాహసవీరుడు – సాగరకన్య (1996)[6]
సూర్యవంశం (1998)
శుభాకాంక్షలు (1998) – సీతారామయ్య
సమరసింహారెడ్డి (1999)
మురారి (2001)
అరుంధతి (2009)

నరసింహుడు (2005)

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
జీవితకాల సాఫల్య పురస్కారం (2017)
నంది అవార్డులు
సవరించు
ఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం (1994)
రఘుపతి వెంకయ్య అవార్డు – 2011
ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు[7]
నటశేఖర – అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.
నటశేఖర – గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
కళా ప్రపూర్ణ – కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
నవరసనటనా సార్వభౌమ – ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.

777 సినిమాలు ఇప్పటిదాకా
28 పౌరాణిక చిత్రాలు
51 జానపద చిత్రాలు
9 చారిత్రక చిత్రాలు
200 మంది దర్శకులతో పనిచేసాడు
223 సినిమాలు 100 రోజులు ఆడాయి
59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి
10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి
10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News