Sunday, February 23, 2025

గుడివాడలో నవరస నటసార్వభౌముడి విగ్రహావిష్కరణ

- Advertisement -
- Advertisement -

కృష్ణా జిల్లా గుడివాడలో నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కైకాల కుటుంబ సభ్యులు, అభిమానులతోపాటు ఎంపి బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు. సామాన్య వ్యక్తిగా మొదలై లెజండ్ గా ఎదిగిన మహోన్నతుడు కైకాల సత్యనారాయణ అనీ, ఆయనది ఎంత చెప్పినా తరగని చరిత్ర అని కొడాలి నాని అన్నారు.

ఎంపి బాలశౌరి మాట్లాడుతూ గుడివాడలో రెండు కోట్లు ఖర్చుచేసి కైకాల కళామందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తన సోదరుడు కళారంగంలో ఓనమాలు నేర్చుకున్నది గుడివాడలోనేనని, ఆయన విగ్రహాన్ని గుడివాడలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కైకాల సోదరుడు నాగేశ్వరరావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News