థింక్వెల్ యాడ్స్ ప్రొడక్షన్లో చైతన్య ఛాయా ఫిలిం క్లబ్ సపోర్ట్‌తో రూపుదిద్దుకున్న సినిమా ‘కైకేయి’. హరి క్యాడర్ల, వినయ్ రెడ్డి, పి.రాజేందర్ రెడ్డి, అల్లు శ్రీనివాస రెడ్డి నిర్మాణంలో సీను అండోజు రచన, దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆమని, ప్రభాకర్, కునాల్ విశ్వజిత్, సంజన ఆకాశం, విశ్వ స్వరూప్, మనీష్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫణి కళ్యాణ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి అనిల్ కుమార్ ఎడిటర్. ఈ సినిమా పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సీను అండోజు మాట్లాడుతూ “కైకేయి చిత్రం తల్లులందరికీ అద్దంలాంటిది.
అమ్మ అమ్మలాగే ఉండాలి ఒక విలన్ కావద్దు. ఆమె తన పిల్లలను కాపాడుకోవాలి. తల్లిదండ్రులు ఓర్పుతో పిల్లలకు భరోసా ఇవ్వాలి కానీ వారిపై ఎక్కువగా ఆశలు పెట్టుకొని మానసిక వత్త్తిడికి గురి చేయవద్దు. ఎంసెట్ ర్యాంక్‌లు కాలేజీలకి ఒక పంట, కానీ స్టూడెంట్స్‌కి సూసైడ్స్ సీజన్ లాగా అయింది. అందుకే ఎంసెట్ ఫలితాల ముందు మేము ఒక సందేశంతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. ఈ సినిమాలో తల్లిగా నటించిన ఆమని తన ఆశయాన్ని కొడుకు మీద బలవంతంగా రుద్దుతుంది. అది వికటించి కొడుకు సాయి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అనేదే కైకేయి సినిమా వృత్తాంతం”అని అన్నారు.