Thursday, January 23, 2025

అగ్నివీరులకు సెక్యూరిటీ గార్డు కొలువులట!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌పై దేశమంతా అందోళనలతో అట్టుడుకుతున్న వేళ.. బిజెపి నేతలు దానిని సమర్థించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశప్రజల దృష్టిలో మరింత పలచన అవుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… అగ్నిపథ్‌లో చేరే అగ్నివీరులకు బట్టలుతకడం, కటింగ్ వంటి వృత్తులలో నైపుణ్యం కల్పిస్తామని చెప్పి అభాసుపాలైనారు. తాజాగా ఇండోర్ మాజీ మేయర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ అలాంటి వ్యాఖ్యలే చేశారు. నాలుగేళ్ల తరువాతసేవ నుండి నిష్క్రమించిన అగ్నివీరులను బిజెపి కార్యాలయానికి సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తానని చెప్పి ఆర్మీ ఉద్యోగార్థుల ఆగ్రహానికి గురయ్యారు. అగ్నిపథ్‌పై నిరసనల నేపథ్యంలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేస్తాడు. అప్పుడు ఆయనకు 11 లక్షల నగదు అందుకుంటాడు. అదీగాక… అగ్నివీర్ బ్యాడ్జ్ కూడా ఉంటుంది. బిజెపి కార్యాలయానికి సెక్యురిటీ గార్డులను నియమించాల్సి వస్తే పదవీవిరమణ చేసిన అగ్ని వీరులకే ప్రాధాన్యం ఇస్తా‘ అని ప్రకటించారు. అంతేకాదు.. దేశం కోసం సైన్యంలో చేరి కాపలా కాశారు. తరువాత బిజెపి ఆఫీసులకు కాపలా కాసి ఆ తరువాతి జీవితం అంతా బతికేయవచ్చు అని అన్నారు. పైగా పాతికేళ్లకు ముందే ఇంటికి వస్తారు కాబట్టి తరువాత ఏం పని చేయాలనే తపనలు వర్రీలు వద్దని తెలిపిన మాజీ మేయర్ సాబ్ ముందు ముందు మాకు కాపలాదార్లుగా ఉందురు లెండనే భరోసాకు దిగారు. మీ మెడలో అగ్నివీరుడనే పతాకం వేలాడుతూ ఉంటుంది. మీకెందుకు దిగులు, మీకు పలు రకాల పనులకు ఆ త రువాత ఆఫర్లు ఉండనే ఉంటాయి. జిందగీకా ఫికర్ న హీ బాబూ అని సెలవిచ్చారు. దీనికి సంబంధించిన వీ డియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష నేతలు కైలాష్ వర్గీయపై మండిపడుతున్నారు.దేశ యు వత, భారత ఆర్మీని అగౌరవపరచవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్ ఆయనకు హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు కూడా కైలాష్ వర్గీయపై ఆగ్రహం వ్య క్తం చేశారు. యువతకు ఇలాంటి ఉపాధులు కల్పించ డం కోసమే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగా ఉండేందు కు మన ఆర్మీ శిక్షణ ఇస్తున్నదా అని అంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా…యువతకు చేయాలనుకుంటే ఉద్యోగాలు కోకొల్లలు, కేవలం సర్కారు కొలువులే వరాలు అనుకుంటే నడవదు చివరికి పకోడిలు వేసుకుని వేలాది రూపాయలు సంపాదించుకుంటే వారు ఉద్యోగాలు పొందినట్లు కాదా? వారు మరో పది మందికి జాబ్‌లు కల్పించినట్లు సమజ్‌చేసుకోవాలని స్టార్టప్‌ల మంత్రాల దశలో పలు సార్లు చెప్పిన ప్రధాని మోడీ బాటలోనే మంత్రులు బిజెపి నేతల ప్రకటనలు ఇస్తున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ ఒవైసీ ఒక అడుగు ముందుకు వేసి… హింసాకాండకు పాల్పడిన ఆర్మీ ఉద్యోగార్థులను గుర్తించి వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా.. సామాజిక మాధ్యమాలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని విజయ వర్గీయ ఆ తరువాత వివరణ ఇచ్చారు.

Kailash Vijayvargiya Controversial Comments on Agneepath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News