Saturday, November 23, 2024

అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Kajal Agarwal abruptly reduced her Remuneration

 

ఏ హీరోయిన్ కూడా తన పారితోషికం తగ్గించదు. క్రేజ్ లేకపోయినా ఒక లక్ష ఎక్కువే అడుగుతుంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అకస్మాత్తుగా తన పారితోషికాన్ని తగ్గించిందట. పెళ్లి చేసుకున్న ఆరు నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ఈ బ్యూటీ. కరోనా సెకండ్ వేవ్ రావడం, సినిమాల నిర్మాణం ఆగిపోవడంతో సీనియర్ హీరోయిన్లకు ఇది కష్టకాలమే. దర్శక, నిర్మాతల ఫోకస్ అంతా క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్లపైనే ఉంటుంది. అందుకే కాజల్ ముందే మేల్కొని డిస్కౌంట్ ఆఫర్లు మొదలుపెట్టినట్లుంది. తనకి అవకాశాలు ఉండేలా గతంలో తీసుకున్న పారితోషికంలో దాదాపు 40 నుంచి 50 శాతం తగ్గిస్తోందట. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి చిరంజీవి ‘ఆచార్య’, రెండోది నాగార్జున చిత్రం.ఇక తమిళంలో ఆగిపోయిన ‘ఇండియన్ 2’ ఉంది. అలాగే కొన్ని వెబ్ డ్రామాలున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News