Friday, January 24, 2025

మాతృత్వపు మధురిమలో కాజల్

- Advertisement -
- Advertisement -

Kajal Agarwal gives birth to fertile male child

మాతృత్వపు మధురిమలో కాజల్

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం కాజల్ -, గౌతమ్ కిచ్లు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ జోరుగా పోస్టులు పెడుతున్నారు. ఇక కాజల్ జనవరిలో తన ప్రెగ్నెన్సీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అప్పటి నుంచి నుండి కాజల్ తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. కొన్ని రోజుల క్రితం ఆమె మాతృత్వంపై ఒక నోట్ కూడా రాసిన సంగతి తెలిసిందే. కాగా కాజల్ అగర్వాల్ ముంబయ్‌కి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును గత ఏడాది అక్టోబర్ 30న వివాహం చేసుకుంది. కరోనా కారణంగా కొద్ది మంది అతిథుల సమక్షంలోనే పెళ్లి వేడుక జరిగింది. ఇక చిరంజీవితో కలిసి కాజల్ నటించిన ‘ఆచార్య’ సినిమా ఈనెల 29న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News