Monday, December 23, 2024

నాలుగు చిత్రాలతో సందడి

- Advertisement -
- Advertisement -

Kajal Agarwal is going to be mother

 

కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది. మరో నాలుగు నెలల్లో ఆమె ఒక పాపకో, బాబుకో జన్మనివ్వనుంది. తల్లి కాబోతుండటంతో ఆమె పలు సినిమాలు వదులుకుంది. అయితే గత ఏడాది ఆమె నటించిన పలు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. రెండేళ్లుగా వాయిదా పడుతోన్న ‘ఆచార్య’ ఈ వేసవిలో విడుదల కానుంది. ‘ఆచార్య’లో ఆమె చిరంజీవి సరసన నటించింది. అలాగే దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన లవ్ స్టోరీ ‘సినామిక’ కూడా త్వరలోనే విడుదలవుతుంది. ఫేమస్ కొరియోగ్రాఫర్ బృంద ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. హిందీలో ఆమె నటించిన ‘ఉమా’ అనే చిత్రం డైరెక్ట్‌గా ఓటిటి వేదికపైకి రానుంది. ఇది కూడా సమ్మర్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. అలాగే తమిళంలో ఆమె నటించిన ఒక హారర్ థ్రిల్లర్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. 2022లో ఆమె ఒక్క చిత్రంలో కూడా నటించే అవకాశం లేదు. కానీ కాజల్ థియేటర్లలో, ఓటిటి వేదికలపై ఈ ఏడాది బాగానే సందడి చేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News